48 ఏళ్ల వయసులో 8 ప్యాక్ బాడీతో హృతిక్​ రోషన్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

  • ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్న హృతిక్ 
  • నిరాశపరిచిన ఇటీవలి 'విక్రమ్ వేద' చిత్రం 
  • ప్రస్తుతం దీపికతో ఫైటర్ చిత్రంలో నటిస్తున్న స్టార్ హీరో
Hrithik Roshan shows off 8 pack bod amid filming for Fighter

బాలీవుడ్ హీరోలు తమ ఆహార్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటారు. వయసుతో సంబంధం లేకుండా ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిస్తుంటారు. బాలీవుడ్ హీర్లలో అత్యంత ఫిట్ బాడీ కలిగిన వాళ్లలో హృతిక్ రోషన్ ముందుంటారు. మంచి హైట్, ఫిజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారాయన. తాజాగా ఆయన 8 ప్యాక్ బాడీ ట్రై చేశారు. జిమ్ లో చొక్కా పైకెత్తి తన 8 ప్యాక్ బాడీని చూపిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. 48 ఏళ్ల వయసులో హృతిక్ ఇంత కష్టపడి 8 ప్యాక్ బాడీ తో కనిపించారు. ఈ ఫొటోలను చూపి సహ నటులతో పాటు అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘సర్.. నాకు రెండు ఆబ్స్ ఇవ్వండి’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘సోమవారం నుంచి నా డైట్ మారుతుంది’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ‘మళ్లీ పాత హృతిక్ తిరిగి వచ్చాడు’ అని మరొకరు ఆయనను ఉత్సాహపరిచారు. ‘ఈ వ్యక్తికి 48 సంవత్సరాలు అంటే మీరు నమ్మగలరా’ అని మరోకరు వ్యాఖ్యానించారు. ఆమధ్య ‘విక్రమ్ వేద’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు హృతిక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు దీపికా పదుకొణేతో కలిసి ‘ఫైటర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది 2024లో విడుదల కానుంది.

More Telugu News