India: అణుకేంద్రాల జాబితాలను ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాకిస్థాన్

  • అణుదేశాలుగా కొనసాగుతున్న భారత్, పాకిస్థాన్
  • ఒకరి అణుకేంద్రాలపై ఒకరు దాడి చేసుకోవడంపై నిషేధం
  • 1988లో ద్వైపాక్షిక ఒప్పందం
  • 1991 నుంచి అమలు
India and Pakistan handed over nuke installations lists

దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ రెండు అణుదేశాలే. భద్రత కోసమంటూ ఇరుదేశాలు అణ్వస్త్రాలను రూపొందించుకున్నాయి. అయితే, పరస్పర విశ్వాసం కోసం గత 32 ఏళ్లుగా భారత్, పాకిస్థాన్ తమ అణుకేంద్రాల జాబితాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో, ఈ ఏడాది కూడా తమ అణుకేంద్రాల జాబితాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. 

ఒకరి అణుకేంద్రాలపై మరొకరు దాడి చేసుకోకుండా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా జాబితా మార్పిడి ఆనవాయతీ కొనసాగుతోంది. ఢిల్లీ, ఇస్లామాబాద్ లోని దౌత్య కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ జాబితాల మార్పిడి జరిగింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య అణుకేంద్రాలపై దాడి నిషేధం ఒప్పందం 1988 డిసెంబరు 31న కుదిరింది. ఈ ద్వైపాక్షిక ఒప్పందం 1991 జనవరి 27 నుంచి అమలవుతోంది.

More Telugu News