Liquor Sales: న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వెల్లువెత్తిన మద్యం అమ్మకాలు

  • కొత్త సంవత్సరం సందర్భంగా పండగ చేసుకున్న మందుబాబులు
  • ఏపీ, తెలంగాణల్లో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్
  • నిన్న తెలంగాణలో రూ.215 కోట్ల అమ్మకాలు
  • ఏపీలో రూ.127 కోట్ల అమ్మకాలు
Liquor sales raised in Telangana and AP on new year eve

నూతన సంవత్సరాది అంటే మందుబాబులకు పండగే పండగ! ప్రతి ఏడాది డిసెంబరు 31వ తేదీ రాత్రి మద్యం వెల్లువలా ప్రవహిస్తుంది. ఈసారి కూడా అందుకు మినహాయింపు కాదు. 2023 సంవత్సరానికి స్వాగతం చెప్పే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు వైన్ షాపులకు, బార్లకు క్యూ కట్టారు. తెలంగాణ, ఏపీల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. 

తెలంగాణలో నిన్న రూ.215.74 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్క హైదరాబాదులో రూ.37.68 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణలో కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. బార్లను రాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. 

ఏపీలోనూ ఇదే తరహా అనుమతులు ఇచ్చారు. మద్యం దుకాణాల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు... బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లకు రాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ క్రమంలో ఏపీలో నిన్న రూ.127 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి.

More Telugu News