వచ్చేనెలలో సెట్స్ పైకి వెళుతున్న ఎన్టీఆర్!

  • ఎన్టీఆర్ 30వ సినిమాకి సన్నాహాలు
  • దర్శకుడిగా రంగాన్ని సిద్ధం చేస్తున్న కొరటాల  
  • కల్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామ్యంలోని సినిమా ఇది 
  • 2024 ఏప్రిల్ 5వ తేదీన సినిమా రిలీజ్
Ntr and koratala movie update

కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. కెరియర్ పరంగా ఎన్టీఆర్ కి ఇది 30వ సినిమా. ముందుగా అనుకున్న ప్రకారం అన్నీ జరిగుంటే ఈ పాటికి ఈ సినిమా షూటింగు ముగింపు దశలో ఉండేది. కానీ 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీగా ఉండటం .. ఆ తర్వాత 'ఆచార్య' ఇబ్బందుల్లో కొరటాల ఉండటం వలన ఆలస్యమవుతూ వచ్చింది. 

ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్టు ఇప్పట్లో ఉండకపోవచ్చనీ .. కొరటాలతో ఉండకపోవచ్చనే వార్తలు షికారు చేశాయి. తాజాగా వదిలిన ట్వీట్ ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు వచ్చేనెలలో మొదలవుతుందని స్పష్టం చేశారు. 

ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ తో కలిసి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఏప్రిల్ 5 .. 2024లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News