Shiva Kandukuri: ఆసక్తిని రేపుతున్న 'భూతద్దం భాస్కర్ నారాయణ' మోషన్ పోస్టర్!

Bhoothaddam Bhaskar Narayana Motion Poster Released
షార్ట్స్‌లో చూడండి
శివ కందుకూరి హీరోగా విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన మరో సినిమా రానుంది. ఆ సినిమా పేరే 'భూతద్ధం భాస్కర్ నారాయణ'. టైటిల్ తోనే ఆశక్తిని రేకెత్తించే ఒక ప్రయత్నమైతే జరిగింది. 

తాజాగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఒక గుహలో శివలింగం ఉంటుంది. ఆ శివలింగం సన్నిధిలో ఒక సిద్ధుడు ధ్యానం చేస్తుంటాడు. ఆ గుహలోకి ఒక ఆసురశక్తి ప్రవేశిస్తుంది. ఒక స్త్రీ మొండానికి ఆ అసురశక్తి తల భాగం అతుకుతుంది. ఇలా మోషన్ పోస్టర్ తోనే ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. 

స్నేహాల్ .. శశిధర్ .. కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించాడు. గతంలో ఆది సాయికుమార్ తో 'శశి' సినిమా చేసిన రాశి సింగ్ ఈ సినిమాలో కథనాయికగా నటిస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది
Go Back to Shorts
Shiva Kandukuri
Rashi Singh
Bhoothaddam Bhaskar Narayana Movie

More Telugu News