Chandrababu: నేడు గుంటూరుకు చంద్రబాబు.. ‘చంద్రన్న కానుక’ పంపిణీ

Chandrababu Today To Distribute Chandranna Kanuka in Guntur
  • గుంటూరు సదాశివనగర్‌లోని వికాస్ హాస్టల్ మైదానంలో ఏర్పాట్లు
  • సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరుకు చంద్రబాబు
  • 30 వేల మందికి అన్నగారి జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉయ్యూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నగారి జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుకను అందిస్తారు. ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ ప్రతి సంక్రాంతికి ‘చంద్రన్న కానుక’ పేరుతో ప్రజలకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసేది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ పథకం ఆగిపోయింది. అయితే, అధికారంలో లేకున్నా పేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో దీనిని తిరిగి కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

గుంటూరు సదాశివనగర్‌లో వికాస్ హాస్టల్ మైదానంలో నేడు 30 వేల మందికి సంక్రాంతి కానుకతోపాటు జనతా వస్త్రాలు పంపిణీ చేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరు చేరుకోనున్న చంద్రబాబు పేదలకు ఈ కానుకలు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు సభ ముగిశాక చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
Chandrababu
Andhra Pradesh
Guntur
TDP
Chandranna Kanuka
Annagari Janata Vastralu

More Telugu News