Chandrababu: ప్రకాశం జిల్లా కట్టావారిపాలెంలో చంద్రబాబు పర్యటన

Chandrababu visits Kattavari Palem in Prakasam District
  • నెల్లూరు జిల్లాలో ముగిసిన చంద్రబాబు పర్యటన
  • ప్రకాశం జిల్లా కట్టావారిపాలెం రాక
  • ఇటీవల కందుకూరులో మృతి చెందిన రాజేశ్వరికి నివాళులు
  • రాజేశ్వరి కుటుంబానికి ఆర్థికసాయం అందజేత
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని ప్రకాశం జిల్లాలో ప్రవేశించారు. కొండపి మండలం కట్టావారిపాలెంలో పర్యటించారు. స్థానికంగా పొగాకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట స్థితిగతులను, ధరల వివరాల గురించి అడిగారు. ఇటీవల కందుకూరు సభలో మరణించిన రాజేశ్వరి అనే మహిళ చిత్రపటానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. అనంతరం రాజేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ఆర్థిక సాయం అందించారు. టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Chandrababu
Kattavari Palem
Kondapi
Prakasam District
TDP

More Telugu News