నాని జోడీగా 'సీతారామం' బ్యూటీ?

  • 'సీతారామం' సినిమాతో మృణాళ్ ఠాకూర్ పరిచయం 
  • యూత్ లో ఆమెకి విపరీతమైన క్రేజ్ 
  • నాని జోడీగా ఛాన్స్ తగిలిందని టాక్ 
  • రేపు పట్టాలెక్కుతున్న ప్రాజెక్టు 
  • త్వరలో నాని నుంచి రానున్న 'దసరా'
Mrunal Thakur in Nani Movie

ప్రస్తుతం నాని 'దసరా' సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో పక్కా మాస్ లుక్ తో నాని కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా కీర్తి సురేశ్ కనిపించనుంది. ఈ సినిమా తరువాత నాని ఏ దర్శకుడితో ఏ సినిమా చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు రేపు పూజా కార్యక్రమాలు జరుపుకోనున్నట్టుగా తెలుస్తోంది. 

కెరియర్ పరంగా ఇది నానీకి 30వ సినిమా. ఈ సినిమాను మోహన్ చెరుకూరి - విజయేందర్ రెడ్డి నిర్మించనున్నారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో కథానాయిక ఎవరై ఉంటారనే విషయంలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. 

ఈ సినిమాలో నాని సరసన నాయికగా 'సీతారామం' బ్యూటీ మృణాళ్ ఠాకూర్ కనిపించనుందని అంటున్నారు. 'సీతారామం'లో సీత పాత్ర ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అప్పటి నుంచి ఆమె ఫాలోయింగ్ పెరుగుతూ వెళుతోంది. ఈ విషయంలో రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More Telugu News