Anjani Kumar: తెలంగాణ నూతన డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతల స్వీకరణ

  • నేడు పదవీ విరమణ చేసిన మహేందర్ రెడ్డి
  • మహేందర్ రెడ్డి నుంచి బాధ్యతలను స్వీకరించిన అంజనీకుమార్
  • జనగామ ఏఎస్పీగా కెరీర్ ను ప్రారంభించిన నూతన డీజీపీ
Anjani Kumar IPS takes charge as Telangana DGP

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్ లతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ఉదయం మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. 


1966 జనవరి 28న బీహార్ లో అంజనీకుమార్ జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యను పాట్నాలో పూర్తి చేసిన ఆయన... పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను ఢిల్లీ యూనివర్శిటీలో పూర్తి చేశారు. ఐపీఎస్ గా ఎన్నికైన తర్వాత 1992లో జనగామ ఏఎస్పీగా ఆయన తన కెరీర్ ను ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ డీజీపీ స్థాయికి చేరుకున్నారు. 1998లో ఐక్యరాజ్యసమితికి డిప్యుటేషన్ పై వెళ్లి బోస్నియాలో శాంతిదళాలతో కలిసి పని చేశారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్ ను కూడా అందుకున్నారు. 2026 జనవరిలో అంజనీకుమార్ పదవీ విరమణ చేయనున్నారు.

More Telugu News