Sonali Bendre: కొత్త కారు కొన్న ఉత్సాహంలో సొనాలీ బింద్రే

Actor Sonali Bendre set to bring in the new year with a Mercedes Benz EClass
  • మెర్సిడెజ్ బెంజ్ ఈ క్లాస్ యజమాని అయిన సొనాలీ
  • ఆమెకు డెలివరీ చేసిన ముంబై డీలర్ సంస్థ
  • సామాజిక మాధ్యమంలో ఫొటోలు షేర్
బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే గుర్తుందా..? మన్మధుడు, మురారి సినిమాలను చూసిన వారు ఈ నటిని మర్చిపోరు. నూతన సంవత్సరానికి ఈ నటి మెర్సిడెజ్ బెంజ్ ఈ క్లాస్ కారుతో ఆహ్వానం పలకనుంది. ముంబైలో నటి సొనాలీకి కారును డెలివరీ చేసిన ఫొటోలను డీలర్ షిప్ సంస్థ ఆటో హ్యాంగర్ సామాజిక మాధ్యమంలో షేర్ చేయడంతో, ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సంపన్నులు ఎక్కువగా ఇష్టపడే కార్లలో మెర్సిడెజ్ బెంజ్ ఈ క్లాస్ కూడా ఒకటి. ఈ క్లాస్ లో బింద్రేకు డెలివరీ చేసిన వేరియంట్ ఏది అన్న దానిపై స్పష్టత లేదు. ఇందులో ఈ350డీ ఈ క్లాస్ వేరియంట్ అన్నది చాలా పాప్యులర్ మోడల్. మెర్సిడెజ్ కుటుంబంలో భాగంగా మారినందుకు నటి సొనాలి బింద్రేకు శుభాకాంక్షలు తెలియజేస్తూ డీలర్ సంస్థ ఆటో హ్యాంగర్ పేర్కొంది.
Sonali Bendre
actor
Mercedes Benz EClass
purchased
new year

More Telugu News