Naresh: పవిత్ర లోకేశ్ కు ముద్దు పెట్టిన వీడియో షేర్ చేసి.. పెళ్లి చేసుకుంటున్నామని ప్రకటించిన సీనియర్ నటుడు నరేశ్

Actor Naresh announces his marriage with Pavitra Lokesh
  • కొంత కాలంగా సహజీవనం చేస్తున్న నరేశ్, పవిత్ర  
  • కొత్త సంవత్సరంలో కొత్త ప్రారంభం అంటూ ట్వీట్
  • అందరి ఆశీర్వాదాలు కావాలన్న నరేశ్
సినీ నటుడు నరేశ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేశ్ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా వీరిద్దరూ న్యూస్ హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. తాజాగా నరేశ్ కీలక ప్రకటన చేశారు. ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 'కొత్త సంవత్సరం. కొత్త ప్రారంభం. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు.

 అంతేకాదు, తన కాబోయే భార్య పవిత్రతో దిగిన వీడియోను షేర్ చేశారు. ఇద్దరూ ఒకరికొకరు కేక్ తినిపించుకున్నట్టు వీడియోలో ఉంది. ఆ తర్వాత ఇద్దరూ అధర చుంబనం చేసుకున్నారు. వీడియో చివర్లో 'గెటింగ్ మ్యారీడ్ సూన్' అని ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Naresh
Pavitra Lokesh
Tollywood
Marriage

More Telugu News