Fadnavis: నీ తండ్రికీ భయపడేది లేదు.. ఆదిత్య థాకరేపై ఫడ్నవిస్ ఎటాక్

Not afraid of even his father Fadnavis replies to Aaditya Thackeray Under his nose
  • 32 ఏళ్ల వ్యక్తికి భయపడిపోతున్నారంటూ ఆదిత్య వ్యాఖ్య
  • దీనికి దీటుగా బదులిచ్చిన మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం
  • నీకే కాదు, నీ తండ్రికి కూడా భయపడేది లేదన్న ఏక్ నాథ్ షిండే
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తీవ్రంగా స్పందించారు. 32 ఏళ్ల వ్యక్తిని చూసి షిండే-ఫడ్నవిస్ సర్కారు భయపడిపోతోందంటూ ఆదిత్య థాకరే కొంత అతిశయోక్తిగా మాట్లాడారు. దీంతో నీకు కాదు కదా, నీ తండ్రికి కూడా తాము భయపడేది లేదన్న గట్టి సమాధానం పాలక నేతల నుంచి వచ్చింది. 

‘‘మేము ఆయన తండ్రికి కూడా భయపడం. ఆయన పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలను ఆయన చూస్తుండగానే (సమక్షంలో) తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ముంబై కాలిపోతుందన్నాడు. కానీ, ఒక్క అగ్గిపుల్ల కూడా కాలలేదు’’ అంటూ ఫడ్నవిస్ చురకంటించారు. తాము ఆదిత్య థారకేకు కాదు కదా, ఆయన తండ్రికి కూడా భయపడేది లేదంటూ.. అదే పార్టీ నుంచి వేరుపడి సీఎం పదవిని అలంకరించిన ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యానిస్తూ, ఆదిత్య వ్యాఖ్యలను బలంగా తిప్పికొట్టారు.
Fadnavis
Aaditya Thackeray
Not afraid

More Telugu News