COVID19: న్యూఇయర్ వేడుకలు ఇంట్లోనే.. సోషల్ మీడియా సర్వేలో నెటిజన్ల అభిప్రాయం

  • సోషల్ మీడియాలో సర్వే చేసిన లోకల్ సర్కిల్స్ ఫ్లాట్ ఫాం
  • 55 శాతం మంది ఇంట్లోనే జరుపుకుంటామని చెప్పినట్లు వెల్లడి
  • న్యూ ఇయర్ కు వేడుకలు చేసుకునే అలవాటు లేదన్న 19 శాతం మంది..
  • కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా వేడుకలు చేసుకోవట్లేదని మరో 2 శాతం మంది వెల్లడి
Survey says 8 in 10 likely to ring New Year at home

కరోనా వ్యాప్తి కారణంగా రెండేళ్లుగా బహిరంగ వేడుకలపై ఆంక్షలు కొనసాగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వేడుకల నిర్వహణపై మన దేశంలో కరోనా ఆంక్షలు లేవు, అయినా సరే న్యూ ఇయర్ ను ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటామని నెటిజన్లు చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతామని అంటున్నారు. 

ఈమేరకు లోకల్ సర్కిల్స్ అనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం నిర్వహించిన సర్వేలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఈ సర్వేలో దేశంలోని 132 జిల్లాలకు చెందిన 13 వేల మందికి పైగా స్త్రీ, పురుషులు పాల్గొన్నారు. ఇందులో 63 శాతం మంది పురుషులు కాగా, 37 శాతం మంది మహిళలు ఉన్నారు.

సర్వేలో భాగంగా న్యూ ఇయర్ వేడుకలను ఎలా జరుపుకుంటున్నారని అడగగా..  55 శాతం మంది కొత్త ఏడాదికి ఇంట్లోనే స్వాగతం పలుకుతామని చెప్పారు. మరో 19 శాతం మంది మాత్రం తమకు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే అలవాటే లేదని చెప్పారు. చైనాలో కరోనా విజృంభిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలోనే ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మరో 5 శాతం మంది నెటిజన్లు చెప్పారు. కుటుంబంతో కలిసి తమ ఏరియాలో జరిగే వేడుకల్లో పాల్గొంటామని 2 శాతం మంది, ఫ్యామిలీ మొత్తం రెస్టారెంట్ కు వెళతామని మరో 3 శాతం మంది జవాబిచ్చారు. ఈ సర్వే వివరాలను లోకల్ సర్కిల్స్ సంస్థ శనివారం ఆన్ లైన్ లో వెల్లడించింది.

More Telugu News