Disney Plus Hotstar: ప్రెస్ నోట్: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సస్పెన్స్ స్టోరీ "బటర్ ఫ్లై"

Disney Plus Hotstars Butterfly
ప్రెస్ నోట్: "బటర్ ఫ్లై".. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఇదో సంచలనం. ఇద్దరు పిల్లల వల్ల గీత అనే అమ్మాయి జీవితంలో ఎదురైన ఊహించని సంఘటనలతో ఉత్కంఠ రేపుతున్న కథ ఇది. ఆ ఇద్దరు పిల్లలు కిడ్నాప్ కావడం ఈ కథకి ముఖ్యమైన మలుపు. దానికీ, గీత అనే అమ్మాయికి ఏమిటి సంబంధం? ఈ కిడ్నాప్ సంఘటనలో గీత ఎలా ఇరుక్కుంది? దాని నుంచి ఎలా బయటపడింది? అనే ప్రశ్నలకు ఈ కథ ఇచ్చే సమాధానాలు మాత్రం అద్భుతం.
 
ఎన్నో కమర్షియల్ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ "బటర్ ఫ్లై" లో గీత గా కొత్తగా నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిల్లల్ని కిడ్నాపర్స్ నుంచి విడిపించడానికి ఆమె చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఆమెకి ఎదురయ్యే అనుభవాలు, ఆమెకి ఎదురుపడే మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు.. అన్నీ కలిపి "బటర్ ఫ్లై" కథని భిన్నమైన స్థాయిలో నిలబెట్టాయి.
 
చిన్నూ, బన్నూ కోసం గీత ఎన్ని సాహసాలు చేసింది? పిల్లల్ని విడిపించడానికి ఎంతవరకు వెళ్ళింది? పిల్లలు దొరికారా ? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న "బటర్ ఫ్లై" చూడాల్సిందే. 
 
"బటర్ ఫ్లై" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: http://bit.ly/3WLiTr6
 

Content Produced by: Indian Clicks, LLC
Disney Plus Hotstar
Butterfly

More Telugu News