Urvashi Rautela: ట్వీట్ చేసి అభిమానులను గందరగోళంలో పడేసిన నటి ఊర్వశి రౌతేలా!

Bollywood Actress Urvashi Rautela Tweet Confused Fans
  • మీరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్
  • ఆ పోస్టుకు ఎవరినీ ట్యాగ్ చేయకపోవడంతో ఊహాగానాలు
  • పంత్‌ను ఉద్దేశించే చేసిందంటున్న అభిమానులు
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తాజాగా చేసిన ట్వీట్ అభిమానులను గందరగోళంలో పడేసింది. ఎవరిని ఉద్దేశించో చెప్పకుండా ‘మీరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానంటూ’ ఆమె చేసిన పోస్ట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు కారణమైంది. అయితే, రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్‌ను ఉద్దేశించే ఆమె ట్వీట్ చేసిందని పంత్ అభిమానులు అంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ మరణాన్ని ఉద్దేశించి చేసిందని మరికొందరు.. కాదు కాదు, పీలేకు సంతాపం తెలుపుతూ చేసిందని ఇంకొందరు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు. ఈ ట్వీట్‌కు కొన్ని గంటల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ప్రార్థిస్తున్నా’ అన్న క్యాప్షన్‌తో వైట్ లవ్ సింబల్, పావురం ఎమోజీలను జతచేసి ఊర్వశి ఓ పోస్టు పెట్టింది. దీనిపైనా విపరీతమైన చర్చ జరిగింది.

కాగా, గతంలో రిషభ్‌పంత్‌కు, ఊర్వశికి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతడి పేరును ప్రస్తావించకుండా ఇలా ట్వీట్ చేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి ఉంటుందని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఊర్వశి తాజాగా టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘బాస్ పార్టీ’ పాటలో చిరంజీవితో కలిసి  స్టెప్పులేసింది.
Urvashi Rautela
Rishabh Pant
Heeraben Modi
Pele

More Telugu News