ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆదాయం రూ.1,320 కోట్లు

TTD releases white paper on assets
  • టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల
  • ఈ ఏడాది స్వామివారిని దర్శించుకున్నవారి సంఖ్య 2.35 కోట్లు
  • 11.42 కోట్ల లడ్డూల విక్రయం
కరోనా ప్రభావం వల్ల 2020, 2021లో తిరుమల క్షేత్రంలో తీవ్ర ఆంక్షల వల్ల భక్తులు పెద్దగా రాలేకపోయారు. 2022లో ఆ పరిస్థితి లేదు. ఆంక్షల ఎత్తివేతతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి హుండీ కూడా అదే స్థాయిలో కళకళలాడింది. ఈ ఏడాది తిరుమల వెంకన్నకు కేవలం హుండీ కానుకల రూపేణా రూ.1,320 కోట్లు లభించింది. ఈ మేరకు టీటీడీ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు. 

ఈ సంవత్సరం ఇప్పటిదాకా స్వామివారిని 2.35 కోట్ల మంది దర్శనం చేసుకున్నారని... 1.08 కోట్ల మంది భక్తులు తలనీలాల మొక్కులు సమర్పించుకున్నారని... 11.42 కోట్ల లడ్డూల విక్రయాలు జరిగాయని టీటీడీ వివరించింది.
Go Back to Shorts
TTD
Assets
Income
Tirumala

More Telugu News