Rishabh Pant: అమిత వేగంతో డివైడర్ పైకి దూసుకొచ్చిన పంత్ కారు... వీడియో ఇదిగో!

Video shows how Pant car rammed onto road divider
  • రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్
  • కాలిబూడిదైన కారు
  • డెహ్రాడూన్ ఆసుపత్రిలో పంత్ కు చికిత్స
  • వైరల్ అవుతున్న రోడ్డు ప్రమాద ఘటన తాజా వీడియో
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం నుంచి గాయాలతో బయటపడడం తెలిసిందే. కారులో రూర్కీ వెళుతుండగా, పంత్ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు ఢిల్లీ-డెహ్రడూన్ జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. గాయాలపాలైన పంత్ ను డెహ్రాడూన్ ఆసుపత్రికి తరలించారు. 

కాగా, హైవేపై ఉన్న సీసీటీవీ కెమెరాలో పంత్ కారు ప్రమాదానికి గురైన దృశ్యాలు రికార్డయ్యాయి. అతివేగంగా వచ్చిన కారు డివైడర్ పైకి దూసుకొచ్చింది. అనంతరం మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. 

ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఎవరైనా ప్రాణాలతో బయటపడడం అసాధ్యమనిపిస్తుంది. అదృష్టం కొద్దీ పంత్ ను అక్కడి వారు బయటికి తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాద ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Rishabh Pant
Road Accident
Car
Road Divider
Video
Team India

More Telugu News