Narendra Modi: ప్రధానమంత్రి మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత

PM Modi Mother Heeraben Modi Dies Days After Hospitalisation
  • అస్వస్థతతో రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన హీరాబెన్
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన నరేంద్రమోదీ
  • వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని ట్వీట్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ ఈ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె వయసు 100 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం ఆమె అస్వస్థతకు గురికావడంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 

తల్లి మరణవార్తను మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని’ పేర్కొన్నారు. ఆమె నిస్వార్థ కర్మయోగి అని, ఆమె జీవితం విలువలతో కూడుకున్నదని పేర్కొన్నారు. వందో పుట్టిన రోజు నాడు తాను తన తల్లిని కలిశానని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎప్పుడూ తనతో ఓ విషయాన్ని చెప్పేవారని, విజ్ఞతతో పనిచేయాలని, జీవితాన్ని స్వచ్చంగా గడపాలని చెప్పేవారని పేర్కొన్నారు. 

ప్రధాని మోదీ తరచూ తన తల్లి గురించి చెబుతూ ఉండేవారు. ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని నెమరు వేసుకునేవారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు తల్లిని కలుసుకున్నారు. 

Narendra Modi
Heeraben Modi
Gujarat

More Telugu News