CM KCR: కేటీఆర్ మామ హరినాథరావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్

CM KCR pays homage to Pakala Harinatha Rao
  • గుండెపోటుతో మరణించిన హరినాథరావు
  • రాయదుర్గంలోని హరినాథరావు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్
  • కోడలు శైలిమను ఓదార్చిన కేసీఆర్ దంపతులు
తెలంగాణ మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సీఎం కేసీఆర్ హైదరాబాదు రాయదుర్గంలోని హరినాథరావు నివాసానికి వెళ్లారు. తన వియ్యంకుడి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న తన కోడలు శైలిమను ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ దంపతులు ధైర్యం చెప్పారు. హరినాథరావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థించారు. 

అటు, మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు కూడా హరినాథరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
CM KCR
Harinatha Rao
KTR
Shailima
Hyderabad

More Telugu News