మృతి చెందిన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి నివాళులు అర్పించిన చంద్రబాబు

  • నిన్న కందుకూరులో చంద్రబాబు సభ
  • భారీగా తొక్కిసలాట.. 8 మంది మృతి
  • దిగ్భ్రాంతికి గురైన చంద్రబాబు
  • మృతుల కుటుంబ సభ్యులకు పరామర్శ
  • పార్టీ తరఫున ఆర్థికసాయం అందజేత
Chandrababu paid homage to deceased party workers

కందుకూరు సభలో మరణించిన కార్యకర్తలకు చంద్రబాబు నివాళులు అర్పించారు. మృతిచెందిన కార్యకర్తల నివాసాలకు వెళ్లిన చంద్రబాబు నివాళులు అర్పించి, ఆర్థికసాయం తాలూకు చెక్కులు అందించారు. మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

ఊటుకూరి పురుషోత్తం, కాకుమాని రాజా, కలవకూరి యానాదిల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు... శోకసంద్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను చూసి చలించిపోయారు. వారిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. నిన్న కందుకూరు సభకు భారీగా పార్టీ శ్రేణులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. చంద్రబాబు అంతకుముందే కార్యకర్తలను పలుమార్లు హెచ్చరించినప్పటికీ, పరిస్థితి అదుపుతప్పింది.

More Telugu News