KA Paul: చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్

KA Paul response on Kandukuru mishap
  • కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి
  • గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన సభ రోడ్డు మీదకు రావడం వల్లే దుర్ఘటన జరిగిందన్న పాల్
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రజాశాంతి పార్టీ అధినేత 
చంద్రబాబు కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది దుర్మరణం చెందడంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన సభ రోడ్డు మీదకు రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. అంతేకాదు, చంద్రబాబుపై కందుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరుకు రోడ్డులో సభ పెట్టారని ఆరోపించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కేఏ పాల్ చెప్పారు. మృతుల పిల్లలకు తమ ఛారిటీ ద్వారా విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.
KA Paul
Chandrababu
Telugudesam
Kandukuru

More Telugu News