prisoners: కర్ణాటక జైళ్లలో ఖైదీల వేతనాలు 3 రెట్లు పెరిగాయి

 Karnataka prisoners salary is 3 times higher again highest salary in india
  • ఖైదీల వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం
  • రాష్ట్రవ్యాప్తంగా 54 జైళ్లలో 3,565 మంది ఖైదీలు
  • ఏటా వేతనాల రూపంలో ఖైదీలకు చెల్లిస్తున్న మొత్తం రూ.58 కోట్లకు పైనే
జైలులో వివిధ పనులు చేసే ఖైదీలకు చెల్లించే వేతనాలను కర్ణాటక ప్రభుత్వం మరోమారు పెంచింది. ఈమేరకు రాష్ట్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 54 జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సంఖ్య 3,565. వీరందరికీ ఏటా చెల్లిస్తున్న వేతనాల మొత్తం రూ.58,28,34,720. ఇప్పుడు ఈ మొత్తాన్ని మూడు రెట్లు పెంచడంతో దేశంలోని మిగతా జైళ్లతో పోలిస్తే కర్ణాటక జైళ్లలోని ఖైదీలు అత్యధిక వేతనం పొందుతున్నారు.

వివిధ నేరాలు చేసి జైలుకు వచ్చిన ఖైదీలు వాళ్లు చేసే పనులకు రోజుకు రూ.524 అందుకుంటారు. రెండో ఏడాది రోజుకు రూ.548 చొప్పున నెలకు (వారానికి ఒక సెలవు మినహాయించి) రూ.14,248 చొప్పున ఖైదీలకు అధికారులు చెల్లిస్తారు. మూడో ఏడాది రోజుకు రూ.615 చొప్పున నెలకు రూ.15,990, నాలుగో ఏడాది నుంచి రోజుకు రూ.663 చొప్పున నెలకు రూ.17,238 చెల్లిస్తారు.

కాగా, ఖైదీల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఉచిత భోజనం, వసతితో పాటు నెలనెలా వేతనం అందుకోవడం బాగుంటుందని, ఖైదీల పనే బాగుందని కామెంట్లు పెడుతున్నారు.
prisoners
Karnataka
jails
prisons
salary

More Telugu News