Jagan: టీడీపీ కార్యకర్తల మృతిపై జగన్ దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటించిన సీఎం

Jagan announces exgratia for those families dead in Chandrababu family
  • చంద్రబాబు సభలో తొక్కిసలాటలో 8 మంది మృతి
  • మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించిన జగన్
  • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఇంతే మొత్తంలో పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Jagan
YSRCP
Kandukuru
TDP
Exgratia

More Telugu News