మంత్రి కేటీఆర్ మామగారు మృతి
- నిన్న సాయంత్రం గుండెపోటుకు గురైన పాకాల హరినాథరావు
- ఫలించని వైద్యుల ప్రయత్నాలు
- భౌతికకాయానికి కేసీఆర్ నివాళి అర్పించే అవకాశం
హరినాథరావు మృతి వార్తతో కేటీఆర్, ఆయన భార్య శైలిమ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన పార్థివదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో ఉన్న నివాసానికి తరలించారు. ఆయన భౌతిక కాయానికి కేసీఆర్ నివాళి అర్పించనున్నట్టు సమాచారం. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ శ్రేణులు సంతాపాన్ని ప్రకటిస్తున్నాయి.