Surya Kumar Yadav: టీ20 వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడంపై సూర్యకుమార్ యాదవ్ స్పందన

Surya Kumar Yadav response after selected as T20 vice captain
  • శ్రీలంకతో టీ20 సిరీస్ కు వైస్ కెప్టెన్ గా సూర్యకుమార్ 
  • ఒత్తిడిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్న సూర్య
  • అద్భుతమైన అనుభూతికి గురవుతున్నానని వ్యాఖ్య
శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ కు సెన్సేషనల్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ ను వైస్ కెప్టెన్ గా బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సూర్యకుమార్ డిప్యూటీగా వ్యవహరిస్తాడు. తనకు వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ రావడంపై సూర్యకుమార్ స్పందిస్తూ... తాను ఏమాత్రం ఊహించలేదని చెప్పాడు. ఈ ఏడాది తాను ఆడిన ఆటకు రివార్డుగా తనకు వైస్ కెప్టెన్సీ దక్కిందని భావిస్తున్నానని తెలిపాడు. కొత్త బాధ్యతలను నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. 

తన తండ్రి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారని... టీ20 సిరీస్ కు ఎంపికైన జట్టు జాబితాను ఆయనే తనకు పంపించారని... వైస్ కెప్టెన్ గా ఎంపికైనందుకు ఒత్తిడికి గురి కావద్దని, నీ బ్యాటింగ్ ను ఎంజాయ్ చేయమని మెసేజ్ కూడా పెట్టారని తెలిపాడు. ఆ క్షణంలో తాను కాసేపు కళ్లు మూసుకున్నానని... ఇది కలా? అని అనుకున్నానని చెప్పాడు. చాలా అద్భుతమైన అనుభూతికి గురవుతున్నానని అన్నాడు. వైస్ కెప్టెన్సీ బాధ్యతను, ఒత్తిడిని స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. నెట్స్ లో ఉన్నప్పుడు, హోటల్ లో ఉన్నప్పుడు తాను ఆలోచిస్తూనే ఉంటానని తెలిపారు. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆటను ఎంజాయ్ చేస్తుంటానని చెప్పాడు.
Surya Kumar Yadav
T20 Vice Captain
Team India

More Telugu News