Roja: ఏ రోజూ ఏ షోకు వెళ్లని పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ షోకి వెళ్లాడు: మంత్రి రోజా విమర్శలు

Roja criticizes Pawan Kalyan after he attended Balakrishna Unstoppable 2 talk show
  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్-2
  • పవన్ కల్యాణ్ తో ఎపిసోడ్
  • పవన్ ప్యాకేజి తీసుకున్నాడన్న రోజా
  • పవన్ ప్యాకేజి కోసం ఎంతకైనా దిగజారతాడని వ్యాఖ్యలు
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే అన్ స్టాపబుల్-2 టాక్ షోకి హాజరవడంపై ఏపీ మంత్రి రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. ఏనాడూ ఏ షోకి హాజరుకాని పవన్ కల్యాణ్ ఇవాళ అన్ స్టాపబుల్ షోకి హాజరయ్యాడని పేర్కొన్నారు. 

ఈ షోకి తొలుత చంద్రబాబు హాజరయ్యాడని, ఆ తర్వాత ప్యాకేజి తీసుకుని పవన్ కల్యాణ్ కూడా షోకి హాజరయ్యాడని వ్యాఖ్యానించారు. ప్యాకేజి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు. అలగా జనం, సంకర జాతి జనం అంటూ దూషించిన బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే షోకి హాజరయ్యాడని రోజా అన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలతో టీడీపీ, బీజేపీ జెండాలు మోయిస్తున్నాడని, జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచించాలని రోజా పేర్కొన్నారు. 

అటు, నారా లోకేశ్ యువగళం పాదయాత్రపైనా రోజా విమర్శలు చేశారు. లోకేశ్ చేపట్టబోయేది యువ గళమా, లేక నారా గరళమా అంటూ ఎద్దేవా చేశారు. కరోనా సంక్షోభ సమయంలో పొరుగు రాష్ట్రంలో దాక్కున్నారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తారని మండిపడ్డారు.
Roja
Pawan Kalyan
Unstoppable-2
Talk Show
Balakrishna
Chandrababu
YSRCP
Janasena
TDP
Andhra Pradesh

More Telugu News