ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని పరామర్శించిన ప్రధాని మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని పరామర్శించిన ప్రధాని మోదీ

PM Modi visits mother in Ahmedabad hospital
  • అస్వస్థతకు గురైన మోదీ మాతృమూర్తి హీరాబెన్
  • అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స
  • అహ్మదాబాద్ చేరుకున్న మోదీ
  • డాక్టర్లను అడిగి తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వైనం
ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ ఈ ఉదయం అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరారు. అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రిలో హీరాబెన్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ అహ్మదాబాద్ వచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని పరామర్శించారు. డాక్టర్లను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. మోదీ రాక నేపథ్యంలో ఆసుపత్రి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

కాగా, ప్రధాని మాతృమూర్తి ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. హీరాబెన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించాయి.  గత జూన్ లో హీరాబెన్ 100వ పుట్టినరోజు జరుపుకున్నారు.
Advertisement
Narendra Modi
Heeraben
Hospital
Ahmedabad
Gujarat

More Telugu News