Aanand Ravi: 'కొరమీను' ఏ ఒక్కరినీ నిరాశపరచదు: హీరో ఆనంద్ రవి

Korameenu Pre Release Event
  • విభిన్నమైన కథా చిత్రంగా రూపొందిన 'కోరమీను'
  • వైజాగ్ నేపథ్యంలో నడిచే కథ 
  • కథానాయకుడిగా ఆనంద్ రవి పరిచయం
  • ఈ నెల 31వ తేదీన విడుదలవుతున్న సినిమా
ఆనంద్ రవి కథానాయకుడిగా ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సమన్య రెడ్డి నిర్మించిన సినిమా 'కొరమీను'. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహించాడు. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో ముడిపడిన కథ ఇది. 

ఓ డ్రైవర్ .. అహంకారంతో కూడిన అతని యజమాని .. వైజాగ్‌ కి చెందిన ఓ పవర్ఫుల్ పోలీస్ .. ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’. డిసెంబర్ 31న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం కొర‌మీను టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది.

డైరెక్టర్ శ్రీపతి మాట్లాడుతూ.. "ఒక డైరెక్టర్‌లా కాకుండా.. ఓ ప్రేక్షకుడిలా చెబుతున్నా. ఈ సినిమా రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. థియేటర్‌ నుంచి బయటకు వచ్చే సమయంలో కచ్చితంగా ప్రేక్షకులే సినిమాను ప్రమోట్ చేస్తారు' అని అన్నారు. హీరో ఆనంద్ రవి మాట్లాడుతూ.. "ఈ సినిమాను చూసిన ఏ ఒక్కరూ నిరాశ చెందరు. ఇంతకు మించి నేనేమీ ఇప్పుడు చెప్పను. ఆ తరువాత మాట్లాడుకుందాం' అని అన్నారు..
Aanand Ravi
Harish Utthaman
Shatru
Korameenu Movie

More Telugu News