Talasani: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: తలసాని

  • కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్న తలసాని  
  • ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ విమర్శలు చేయడానికా? అని ప్రశ్న 
  • అభివృద్ధిలో పోటీ పడాలని హితవు
Talasani slams Kishan Reddy

కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో, ఏ పనులు చేశారో చెప్పాలని నిలదీశారు. కనీసం ఆయన సికింద్రాబాద్ కు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నుకుంది రాజకీయ విమర్శలు చేయడానికేనా? అని ప్రశ్నించారు. విమర్శల్లో కాదు... అభివృద్ధిలో పోటీపడండి అని తలసాని హితవు పలికారు. 

దర్యాప్తు సంస్థలపై బీజేపీ నేతలకు చిన్నచూపు ఎందుకని అన్నారు. సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తే ఇక కేసు లేనట్టే అనే విధంగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని తలసాని విమర్శించారు. 'ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో సంబరాలు చేసుకోవడానికి న్యాయస్థానం ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా...? ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంబంధం లేదంటారు... మళ్లీ వాళ్లే కోర్టుకు వెళతారు' అంటూ తలసాని బీజేపీ నేతలపై మండిపడ్డారు.

More Telugu News