Manchu Vishnu: మంచు విష్ణుకి ఈ ఏడాది కూడా కలిసి రాలేదే!

Manchu Vishnu Special
  • వరుస ఫ్లాపులతో ఉన్న విష్ణు
  • నిర్మాతగాను నష్టాలు  
  • ఈ ఏడాది నిరాశపరిచిన 'జిన్నా'
  • వచ్చే ఏడాదిపైనే ఆశలు 

మంచు విష్ణు తన కెరియర్ ఆరంభం నుంచి కూడా తండ్రి మాదిరిగానే యాక్షన్ కామెడీ జోనర్ ను నమ్ముకుంటూ వెళ్లాడు. అంతేకాదు తండ్రి మాదిరిగానే సొంత బ్యానర్లో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, సక్సెస్ అనేది ఒక పట్టాన ఆయన వైపు వెళ్లడం లేదు. అయినా ఆయన తన పట్టును మాత్రం విడిచిపెట్టడం లేదు.

ఐదారేళ్లుగా ఆయన విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. విలక్షణమైన పాత్రలను చేశాడు. కొంతమంది దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. అయినా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన 'జిన్నా' సినిమాను చేశాడు. ట్రైలర్ చూసిన వాళ్లంతా ఇది రొమాంటిక్ యాక్షన్ కామెడీ అనుకున్నారు. 

తీరా థియేటర్ కి వెళ్లి చూస్తే .. ఈ కథ థ్రిల్లర్ జోనర్ ను కూడా టచ్ చేస్తూ పరిగెత్తింది. ఈ కథకి ఏవి ప్లస్ అవుతాయని విష్ణు అనుకున్నాడో .. అవే మైనస్ అయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమాతో ఈ ఏడాది కూడా ఆయనకి ఫ్లాపునే అప్పగించి వెళ్లిపోతోంది. మరి వచ్చే ఏడాది ఆయన ఏ జోనర్ ను ఎంచుకుంటాడో చూడాలి.

  • Loading...

More Telugu News