Sensex: స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాల ప్రభావం 
  • లాభనష్టాల మధ్య కొనసాగిన మార్కెట్లు
  • 17 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
Markets ends in losses

ఈరోజు ఒడిదుడుకుల మధ్య కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆద్యంతం లాభనష్టాల మధ్య మార్కెట్లు కొనసాగాయి. అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు ఉండటం, మళ్లీ కరోనా భయాలు మొదలు కావడం వంటి పరిణామాలతో మదుపరులు సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 17 పాయింట్లు కోల్పోయి 60,910కి పడిపోయింది. నిఫ్టీ 9 పాయింట్లు పతనమై 18,122 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (2.74%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.81%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.39%), మారుతి (1.27%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.98%). 

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-1.39%), యాక్సిస్ బ్యాంక్ (-1.10%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.08%), టాటా స్టీల్ (-1.08%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.87%).

More Telugu News