Revanth Reddy: దర్యాప్తు సంస్థలను ఈ రెండు పార్టీలు వాడుకుంటున్నాయి: రేవంత్ రెడ్డి

  • ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ, బీఆర్ఎస్ లను బాధితులుగానే చూపిస్తున్నారన్న రేవంత్ 
  • దోషి ఎవరనే విషయం తేలాల్సి ఉందని వ్యాఖ్య 
  • కేసులో ఉన్న ఎమ్మెల్యేలలో నలుగురు పార్టీ మారినవారేనని విమర్శ 
BJP and BRS are misusing investigating agencies

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ విచారణ అనగానే బీఆర్ఎస్, సీబీఐ విచారణ అనగానే బీజేపీలు సంబరపడిపోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దర్యాప్తు సంస్థలను ఈ రెండు పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో రెండు పార్టీలను బాధితులుగానే చూపిస్తున్నారని.. ఈ కేసులో దోషి ఎవరనేది తెలియాలని అన్నారు. విచారణను తామే జరుపుతామని బీఆర్ఎస్ ప్రభుత్వం అనడంతో ఆ పార్టీ లోపం బయటపడిందని చెప్పారు. ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ వేద్దామా అనే విషయం గురించి తాము ఆలోచిస్తున్నామని తెలిపారు. 

ఈ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు పార్టీ మారినవారేనని రేవంత్ విమర్శించారు. పార్టీ మారినందుకు బీఆర్ఎస్ లో వీరికి మంచి పదవులు ఇచ్చారని అన్నారు. ఇది కూడా అవినీతేనని ఆరోపించారు. 2018లో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను కూడా విచారించాలని సీబీఐని కోరుతామని చెప్పారు.

More Telugu News