మావాడి కెరియర్ 'టాప్ గేర్'లో దూసుకెళ్లాలి: సాయికుమార్ 

  • ఆది సాయికుమార్ హీరోగా రూపొందిన 'టాప్ గేర్'
  • ఆయన జోడీకట్టిన రియా సుమన్ 
  • బిగ్ టికెట్ లంచ్ చేసిన సాయికుమార్ 
  • ఈ నెల 30వ తేదీన సినిమా విడుదల  
Top Gear Pre Release Event

ఆది సాయికుమార్ హీరోగా 'టాప్ గేర్' సినిమా రూపొందింది. శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి శశికాంత్ దర్శకత్వం వహించాడు. రియా సుమన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. సాయికుమార్ - సందీప్ కిషన్ కలిసి ఈ స్టేజ్ పై 'బిగ్ టికెట్' ను లాంచ్ చేశారు. 

ఈ వేదికపై సాయికుమార్ మాట్లాడుతూ .. "మా నాన్నతో మొదలైన మా జర్నీ ఇప్పుడు ఆది వరకు వచ్చింది. ఆదిని ఒక క్రికెటర్ అవ్వాలని అనుకొన్నాము. కానీ మెగాస్టార్ అన్నయ్య సాంగ్ తో ఇండస్ట్రీకి వచ్చాడు. మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అందరూ ఈ 'టాప్ గేర్' సినిమా ట్రైలర్, టీజర్ బాగుందని మెచ్చుకుంటున్నారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మా ఆది కి బిగ్ బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నాను" అన్నారు.

 సందీప్ కిషన్ మాట్లాడుతూ .. " ఆది నాకు బెస్ట్ ఫ్రెండ్ .. ఈ సినిమాలో తను చాలా బాగా నటించాడు. తనకు ఈ సినిమా బిగ్ హిట్ ఇవ్వడమే కాకుండా, అది కెరియర్ ను 'టాప్ గేర్'లో ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. వచ్చే ఏడాదిలో తను హీరోగా నేను ఒక సినిమా తీయడానికి ప్లానింగ్ చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. 

 హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు శశి చాలా డెడికేషన్ ఉన్న వ్వక్తి. తను ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. సాయి శ్రీరామ్ గారి ఫ్రేమింగ్ చాలా బాగుంటుంది. నన్ను .. రియాను చాలా బాగా చూపించారు. హర్ష గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు . సిద్ శ్రీరామ్ పాడిన వెన్నెల వెన్నెల పాట పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. టెక్నిషియన్స్ అందరు ఫుల్ సపోర్ట్ చేశారు. అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

More Telugu News