Devon Conway: న్యూజిలాండ్ క్రికెటర్ దేవాన్ కాన్వే కొత్త రికార్డ్

  • కేవలం 11 టెస్టుల్లోనే 1,000 పరుగులు
  • ఇంత వేగంగా ఈ లక్ష్యాన్ని సాధించిన కివీ ఆటగాడు ఇతడే
  • పాకిస్థాన్ తో తొలి టెస్ట్ మ్యాచ్ లో ఈ రికార్డు
Devon Conway Becomes Fastest New Zealand Batter To Achieve This Feat In Test Cricket

న్యూజిలాండ్ క్రికెటర్ దేవాన్ కాన్వే ఓ సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు. అత్యంత వేగంగా టెస్టుల్లో 1,000 పరుగులు సాధించిన న్యూజిలాండ్ క్రికెటర్ రికార్డ్ ఇప్పుడు అతడి వశమైంది.  కరాచీలో పాకిస్థాన్ తో తొలి టెస్ట్ మ్యాచ్ లో కాన్వే 156 బంతులకు 82 పరుగులు సాధించడం ద్వారా ఈ రికార్డ్ నమోదు చేశాడు. ఇందులో 12 బౌండరీలే ఉన్నాయి. 

11 టెస్ట్ మ్యాచులకే కాన్వే 1,000 పరుగులు సాధించడం విశేషం. టెస్టుల్లో మూడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు కూడా నమోదు చేశాడు. టెస్టుల్లో అతడి అత్యుత్తమ స్కోర్ 200. న్యూజిలాండ్ ఆటగాడు జాన్ రీడ్ 20 ఇన్నింగ్స్ లలో 1,000 పరుగులు పూర్తి చేయగా, ఒక ఇన్నింగ్స్ తక్కువకే దేవాన్ కాన్వే దీన్ని సాధించేశాడు. ఇంగ్లండ్ ఆటగాడు హెర్బర్ట్ సట్ క్లిఫ్ కేవలం 12 ఇన్నింగ్స్ లలో చేసిన వెయ్యి పరుగులు ప్రపంచ రికార్డుగా ఉంది. మొత్తం మీద పాకిస్థాన్ తో టెస్ట్ మ్యాచ్ లో కాన్వే మొదటి ఇన్నింగ్స్ లో 92 పరుగులకు అవుటయ్యాడు.

More Telugu News