Team India: న్యూ ఇయర్ వేడుకల కోసం అజ్ఞాత ప్రదేశానికి విరాట్ కోహ్లీ, అనుష్క

Virat Kohli and Anushka Sharma jet off to an undisclosed location for New Year celebrations
  • ముంబై ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణం
  • బంగ్లాదేశ్ పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన విరాట్
  • శ్రీలంకతో టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న వైనం

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఒక అజ్ఞాత ప్రదేశానికి బయలుదేరారు. ఈ జంట బుధవారం తెల్లవారుజామున ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ప్రత్యేక విమానంలో ఈ జంట ప్రయాణం చేసింది. అయితే, వీరు ఎక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారో తెలియరాలేదు. ఎయిర్ పోర్టు ముంగిట మాత్రం ఈ ఇద్దరూ ఫొటోలకు పోజులు ఇస్తూ ఉత్సాహంగా కనిపించారు. 

బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ముగించుకున్న తర్వాత భారత జట్టుతో కలిసి కోహ్లీ మంగళవారమే స్వదేశానికి చేరుకున్నాడు. జనవరి 3 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్ కు కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సమయాన్ని కుటుంబంతో వెచ్చించేందుకు అతను విదేశీ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘చక్దా ఎక్స్ ప్రెస్’ ఇటీవలే పూర్తయింది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో అనుష్క.. భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి పాత్రలో కనిపించనుంది.

  • Loading...

More Telugu News