రూ.25,199కే నథింగ్ ఫోన్

  • ఫ్లిప్ కార్ట్ పై ఇయర్ ఎండింగ్ సేల్
  • విక్రయ ధర రూ.27,999
  • ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ పై రూ.2,800 తగ్గింపు
Nothing Phone selling at an effective price of Rs 25199 via Flipkart Check out details

నథింగ్ ఫోన్ మరింత తక్కువ ధరకే ఆఫర్లో భాగంగా అందుబాటులోకి వచ్చింది. ఇతర ఫోన్లతో పోలిస్తే నథింగ్ ఫోన్ భిన్నంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫోన్ వెనుక పారదర్శకంగా ఉండడం, ఎల్ఈడీ లైట్లతో కూడిన ప్రత్యేక డిజైన్ తో ఉండడం కొందరిని ఎంతో ఆకర్షిస్తోంది. ధర తగ్గిస్తే కొనుగోలు చేద్దామని చూసే వారికి ఇప్పుడు మంచి ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చింది.

వాస్తవానికి అయితే ఈ ఫోన్ ధర ఇప్పటి వరకు రూ.30,000గా ఉంది. పలు సందర్భాల్లో ఆఫర్లలో భాగంగా రూ.28 వేలకు విక్రయించారు. ఇప్పుడు ఈ ఫోన్ ను రూ.25,199కే సొంతం చేసుకోవచ్చు. ఇయర్ ఎండింగ్ ఆఫర్లో భాగంగా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.27,999గా ఉంది. ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్ట్ తో కొనుగోలు చేసే వారికి 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.2,800 తగ్గుతుంది. దీంతో ఈ ఫోన్ రూ.25,199కి లభిస్తుంది. 

ఈ ధర ఆకర్షణీయమేనన్నది టెక్ నిపుణుల అభిప్రాయం. ఇది 5జీ ఫోన్. రోజువారీ సోషల్ మీడియా, బ్రౌజింగ్, కాలింగ్, చాటింగ్ వంటి టాస్క్ లకు పరిమితమయ్యే వారికి వేగవంతమైన, చక్కటి అనుభవాన్ని ఫోన్ ఇస్తుందని అంటున్నారు.More Telugu News