ధోనీ కూతురుకు మెస్సీ కానుక
- తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి పంపిన మెస్సీ
- అది వేసుకుని మురిసిపోతున్న జివా ధోని
- జెర్సీతో దిగిన ఫొటోను ఇన్ స్టాలో పెట్టిన జివా
క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ తనకెంతో ఇష్టమైన ఆట అంటూ మహేంద్ర సింగ్ ధోని గతంలో చాలాసార్లు చెప్పారు. తండ్రిలాగే జివాకు కూడా ఫుట్ బాల్ ఆటంటే చాలా ఇష్టం. అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ ఆటను తండ్రితో కలిసి చూస్తుంటుంది. ఈ క్రమంలో మెస్సీ ఆటోగ్రాప్ చేసిన జెర్సీ అందుకోవడంపై జివా సంతోషం వ్యక్తంచేస్తోంది. ఇన్ స్టా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది.