Russia: అమెరికాలో అంతర్యుద్ధం తప్పదు.. మస్క్‌ అధ్యక్షుడవుతారు: రష్యా మాజీ అధ్యక్షుడి జోస్యం

  • రష్యాకు అధ్యక్షుడిగా, ప్రధానిగా పనిచేసిన మెద్వ్‌దేవ్
  • టెక్సాస్, కాలిఫోర్నియా స్వతంత్ర రాజ్యాలుగా విడిపోతాయన్న మెద్వ్‌దేవ్
  • ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు పతనమవుతాయని జోస్యం
  • బ్రిటన్ తిరిగి ఈయూలో చేరుతుందన్న రష్యా మాజీ అధ్యక్షుడు
  • ఏడాది తర్వాత గుర్తు చేయమన్న ఎలాన్ మస్క్
Civil war in US Elon Musk to Russian officials wild predictions for 2023

వచ్చే ఏడాది అమెరికాలో అంతర్యుద్ధం తప్పదని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వ్‌దేవ్ జోస్యం చెప్పారు. అంతేకాదు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆ దేశాధ్యక్షుడవుతారని అంచనా వేశారు. మెద్వ్‌దేవ్ 2008 నుంచి 2012 వరకు రష్యా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2012 నుంచి 2020 వరకు ప్రధానిగా పనిచేశారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆంతరంగికుడిగా, రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న మెద్వ్‌దేవ్ తాజాగా కొత్త సంవత్సరంలో జరగబోయే కీలక పరిణామాలపై తన అంచనాలను వెల్లడించారు.

ఆయన పేర్కొన్న అంచనాల ప్రకారం.. వచ్చే ఏడాది అమెరికాలో అంతర్యుద్ధం మొదలవుతుంది. ఫలితంగా రాష్ట్రాలు విడిపోతాయి. కాలిఫోర్నియా, టెక్సాస్‌లు స్వతంత్ర రాజ్యాలు అవుతాయి. ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అమెరికాకు అధ్యక్షుడు అవుతారు. ఐఎంఎప్, ప్రపంచ బ్యాంకు పతనమవుతాయి. బ్రిటన్ తిరిగి యూరోపియన్ యూనియన్‌ (ఈయూ)లో చేరుతుంది. ఆ తర్వాత ఈయూ కూడా కుప్పకూలుతుందని మెద్వ్‌దేవ్ జోస్యం చెప్పారు. ఆయన జోస్యంపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఇలాంటి అసంబద్ధ అంచనాలను తానెప్పుడూ వినలేదన్నారు. ఏడాది తర్వాత మళ్లీ వీటిని గుర్తు చేయాలని మెద్వ్‌దేవ్‌కు సూచించారు.

More Telugu News