Chiranjeevi: ఇది మెగా మాస్ మూవీ: దేవిశ్రీ ప్రసాద్

Waltair Veerayya movie Press Meet
  • 'వాల్తేరు వీరయ్య' ప్రెస్ మీట్ లో దేవిశ్రీ 
  • దర్శకుడు బాబీ పై ప్రశంసలు 
  • రవితేజ కూడా మెగా అభిమానినే అంటూ వ్యాఖ్య 
  • ఈ సినిమాలో అభిమానులకు కావాల్సినవన్నీ ఉంటాయని వెల్లడి 
చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ గురించి తెలిసిందే. ఇక మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా బాబీకి కూడా మంచి ఇమేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' జనవరి 13వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్ కి చిరంజీవి .. రవితేజ .. రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఊర్వశి రౌతేలా  .. దేవిశ్రీ .. చంద్రబోస్ తదితరులు హాజరయ్యారు.

ఈ స్టేజ్ పై దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ .. " ఈ సినిమాలో చిరంజీవిగారితో కలిసి రవితేజ గారు చేస్తున్నాడని బాబీ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. చిరంజీవిగారికి బాబీ అభిమాని. ఆయన స్పూర్తితో సినిమాల్లోకి వచ్చాడు. అలా చిరంజీవిగారి స్ఫూర్తితోనే రవితేజ కూడా ఇండస్ట్రీకి వచ్చాడు. అలాంటిది ఇద్దరూ కలిసి చిరంజీవిగారితో సినిమా చేయడం నిజంగా విశేషం" అన్నాడు. 

"మెగాస్టార్ .. మాస్ మహారాజ్ కలిసి చేసిన సినిమా కావడం వలన ఇది మెగా మాస్ మూవీ అనొచ్చునేమో. ఈ సినిమాలో యాక్షన్ .. ఎమోషన్ .. సాంగ్స్ .. ఫైట్స్ .. ఇలా ఎవరికి ఏం కావాలో అవి ఉండేలా బాబీ చూసుకున్నాడు. ఈ కథను .. పాత్రలను ఆయన బ్యాలెన్స్ చేసిన తీరు అద్భుతం. ఇక రామ్ లక్ష్మణ్ ఫైట్స్ .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి" అని చెప్పుకొచ్చాడు.
Chiranjeevi
Sruthi Haasan
Raviteja
waltair Veerayya Move

More Telugu News