YV Subba Reddy: తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష

YV Subbareddy reviews Vikuntadwara Darshanam in Tirumala
  • తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు
  • తిరుపతిలో టోకెన్ల జారీ
  • 9 చోట్ల 92 కౌంటర్లు ఏర్పాటు చేశామన్న వైవీ సుబ్బారెడ్డి
  • డిసెంబరు 31, జనవరి 1న ఉచిత దర్శన టోకెన్లు ఇవ్వబోమని వెల్లడి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి వైకుంఠద్వార దర్శనంపై నేడు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త ఏడాది వైకుంఠద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. 10 రోజుల పాటు ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. సర్వదర్శన భక్తుల కోసం తిరుపతిలో 9 చోట్ల 92 కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 

భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి భక్తులు టోకెన్లు తీసుకుని తిరుమల రావాలని స్పష్టం చేశారు. ఉచిత టోకెన్లు ఉన్నవారు కృష్ణతేజ అతిథి గృహం వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు. 

డిసెంబరు 31, జనవరి 1న ఉచిత సర్వదర్శనానికి టోకెన్లు ఇవ్వబోమని వైవీ వెల్లడించారు. గోవిందమాల వేసుకున్న భక్తులు సైతం టోకెన్లు తీసుకుని రావాలని చెప్పారు. వైకుంఠద్వార దర్శనానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించి రావాలని తెలిపారు
YV Subba Reddy
Vaikuntadwara Darshanam
Tirumala
TTD

More Telugu News