పోలీసులకు నిష్పాక్షికత, ధైర్యం అవసరం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- శీతాకాల విడిది కోసం హైదరాబాదులో ఉన్న రాష్ట్రపతి
- నేషనల్ పోలీస్ అకాడమీలో ఓ కార్యక్రమానికి హాజరు
- పోలీసులు ప్రభుత్వంలో కీలకం అని వెల్లడి
- పోలీసులకు పారదర్శకత ఉండాలని పిలుపు
పోలీసులకు అప్రమత్తత, సున్నితత్వం, నిజాయతీ అవసరం అని తెలిపారు. పోలీసులకు నిష్పాక్షికత, పారదర్శకత, ధైర్యం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించారు. పోలీసులు... పేదలు, బలహీనవర్గాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
దేశంలోని అన్ని రంగాల్లో మహిళా సాధికారత రావాలని ఆమె అభిలషించారు. స్కాండినేవియన్ దేశాల్లో పోలీసు శాఖలో 30 శాతం మంది మహిళలే ఉంటారని వివరించారు. దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.