రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడతారంటూ పుకార్లు.. పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు
- రేవంత్ కొత్త పార్టీ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
- శంకర్ అనే వ్యక్తి ప్రచారం చేసినట్టు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు
- కొన్నాళ్లుగా టీ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు
రేవంత్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేయించారంటూ పోస్టులు కనిపించాయి. దీనిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేసింది శంకర్ అనే వ్యక్తిగా గుర్తించింది. ఆయనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్ కుమార్ గౌడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారం చేసిన శంకర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.