Rashmika Mandanna: రష్మిక మందన్న కారు వెంట పడ్డ అభిమానులు.. సలహా ఇచ్చిన ముద్దుగుమ్మ!

Fans chase Rashmika Mandanna on bike after Varisu audio launch
  • చెన్నైలో వారీసు సినిమా ఆడియో విడుదల కార్యక్రమం
  • అనంతరం కారులో హోటల్ కు వెళుతున్న రష్మిక
  • బైక్ లపై ఆమెను అనుసరించిన అభిమానులు
తనను అనుసరిస్తున్న ఆకతాయి అభిమానుల పట్ల రష్మిక మందన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరింది. ఈ నెల 24న చెన్నైలో 'వారీసు' సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి రష్మిక హాజరైంది. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కారులో రష్మిక హోటల్ కు బయల్దేరి వెళుతోంది. అది చూసిన కొందరు అభిమానులు తమ బైక్ లపై ఆమెను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు.

దీన్ని ఆమె గమనించింది. మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆమె కారు ఆగింది. ఓ బైకర్ ఆమెకు సమీపంగా వచ్చాడు. దీంతో రష్మిక కొంత ఆగ్రహంతో హెల్మెట్ లేకుండా ప్రయాణించొద్దని, ధరించాలని కోరింది. అలాగే పెట్టుకుంటామని వారు చెప్పగా, లేదు వెంటనే హెల్మెట్ పెట్టుకోవాలని కోరింది. వారీసులో తలపతి విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. తదుపరి మిషన్ మంజు, యానిమల్, పుష్ప2 సినిమాల్లో కనిపించనుంది.
Rashmika Mandanna
Varisu
audio launch
fans chase
chennai

More Telugu News