Bollywood: సల్మాన్‌ఖాన్ 57వ బర్త్ డే.. హాజరైన షారుఖ్ ఖాన్.. ఫొటోలు వైరల్

Shah Rukh Khan attends Salman Khans 57th birthday bash
  • గత రాత్రి వేడుకగా బర్త్ డే పార్టీ
  • ఆతిథ్యమిచ్చిన సల్మాన్ సోదరి అర్పితా శర్మ
  • హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీలు
బాలీవుడ్ ‘భాయ్‌జాన్’ సల్మాన్ ఖాన్ తన 57వ పుట్టిన రోజు ఘనంగా జరుపుకున్నాడు. సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ గత రాత్రి తన నివాసంలో బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసింది. పూర్తి బ్లాక్ అవుట్‌ఫిట్‌ ధరించిన సల్మాన్ ఉత్సాహంగా కనిపించాడు. ఈ పార్టీకి ఆయన స్నేహితుడు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా హాజరయ్యాడు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. 

సల్మాన్ పుట్టిన రోజు వేడుకలకు జాన్వీకపూర్, కార్తీక్ ఆర్యన్, సోనాక్షి సిన్హా, సునీల్ శెట్టి తదితర సెలబ్రిటీలు హాజరయ్యారు. పార్టీకి చిట్టచివరగా వచ్చిన షారుఖ్ కూడా అచ్చం సల్మాన్ ధరించినట్టుగానే పూర్తి బ్లాక్ అవుట్‌ఫిట్‌తో వచ్చాడు. ఇద్దరూ చేతులు కలిపి ఫొటోలకు పోజులిచ్చిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అర్పిత తన భర్త ఆయుష్ శర్మ, పిల్లలతో కలిసి పార్టీలో సందడి చేయగా, జాన్వీకపూర్, పూజా హెగ్డే, టబు, సునీల్ శెట్టి, రితేశ్, జెనీలియా, సోనాక్షి సిన్హా, సల్మాన్ సోదరులు సోహల్, అర్బాజ్, సోదరి అల్విరా తదితరులు పార్టీకి హాజరై సందడి చేశారు. 

ఫొటోలు, వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Bollywood
Salman Khan
Shahrukh Khan
Arpita Khan Shrma

More Telugu News