బీహార్‌లో పరువు హత్య.. చెల్లెలి ప్రియుడిని నరికి చంపి కుక్కలకు ఆహారంగా వేసిన యువకుడు!
- నలంద జిల్లాలో ఘటన
- యువకుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నరికి చంపిన నిందితుడు
- పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించిన వైనం
ఈ క్రమంలో రాహుల్ అనే యువకుడిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిట్టు తన సోదరితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయానని, అందుకనే అతడిని మట్టుబెట్టానని చెప్పుకొచ్చాడు. ఈ నెల 16న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చంపేశానని అంగీకరించాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశానని, మిగతా వాటిని నదిలో పడేశానని చెప్పాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.