Twitter: ట్విట్టర్ లో చరిత్రలో అతి పెద్ద డేటా లీకేజి... డార్క్ వెబ్ లో అమ్మకానికి వివరాలు!

  • ట్విట్టర్ పై హ్యాకింగ్ పంజా
  • 40 కోట్ల ట్విట్టర్ యూజర్ల వివరాలు హ్యాకర్ వశం
  • బాధితుల్లో సుందర్ పిచాయ్, సల్మాన్ ఖాన్!
  • డార్క్ వెబ్ లో అమ్మకానికి ఉంచిన హ్యాకర్
Twitter data leakage as per a report

ఇంటర్నెట్ వినియోగదారులకు సైబర్ నేరగాళ్ల నుంచి అనుక్షణం ముప్పు పొంచి ఉంటుంది. తాజాగా, 40 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటా హ్యాకింగ్ కు గురైందని ఓ నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ డేటా డార్క్ వెబ్ లో అమ్మకానికి ఉంచినట్టు సదరు నివేదిక పేర్కొంది. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో గూగుల్ పిచాయ్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ల వ్యక్తిగత వివరాలు కూడా డార్క్ వెబ్ లో ప్రత్యక్షమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ వెల్లడించింది. 

ట్విట్టర్ వినియోగదారుల ఈ-మెయిల్ ఐడీ, పేరు, యూజర్ నేమ్, ఫాలోవర్ల వివరాలు, ఫోన్ నెంబర్లను హ్యాకర్ డార్క్ వెబ్ లో విక్రయానికి ఉంచాడని వివరించింది. 

ట్విట్టర్ చరిత్రలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ డేటా లీకేజి అని హడ్సన్ రాక్ తెలిపింది. రెండు నెలల కిందట 5.4 మిలియన్ల ట్విట్టర్ ఖాతాల డేటా హ్యాకర్ల పాలైంది. ఇప్పుడు దాన్ని మించిపోయే డేటా లీకేజి చోటుచేసుకుంది.

More Telugu News