Vijay Devarakonda: 'లైగర్' ఎఫెక్టుతో రూట్ మారుస్తున్న విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda Special
  • దూకుడు చూపుతూ వచ్చిన విజయ్ దేవరకొండ 
  • 'లైగర్' విషయంలో ట్రోలింగ్ బారినపడిన హీరో 
  • ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'ఖుషీ'
  • తన ప్లానింగ్ లో మార్పులు చేసుకున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ మొదటి నుంచి కూడా తన దూకుడు చూపిస్తూ వచ్చాడు. నిజానికి ఆయనలో అందరూ ఇష్టపడింది కూడా ఆ దూకుడే. తన మనసులో ఏదీ దాచుకునే అలవాటు ఆయనకి లేదు. స్టేజ్ పై కూడా తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉంటాడు. తన సినిమా ప్రమోషన్స్ లో ఆయన చెలరేగిపోతుంటాడు.

 'లైగర్' సినిమా ప్రమోషన్స్ లో కూడా విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లోనే మాట్లాడాడు. అయితే పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఆ సినిమా పరాజయాన్ని చవిచూసింది. హీరోకి నత్తి పెట్టడం వలన పూరి మార్క్ డైలాగులను ఆడియన్స్ మిస్సయ్యారు. హీరోయిన్ అనన్య పాండే విషయానికొస్తే ఆమె విజయ్ దేవరకొండ జోడీగా ఆనలేదు. ఇక మైక్ టైసన్ ను తీసుకోవడం .. ఆయనతో ముడిపడిన క్లైమాక్స్ ఈ సినిమాకి మైనస్ అయ్యాయి అనే టాక్ వచ్చింది. 

ఈ సినిమా రిలీజ్ కి ముందు విజయ్ దేవరకొండ మాటలను నెటిజెన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం అంతకుముందులా రియాక్ట్ కాలేదు. ఈ ఏడాదిలో వచ్చిన ఈ సినిమా ఆయనకి కొత్త పాఠమే నేర్పింది. అందువలన సైలెంట్ గా 'ఖుషీ' సినిమా పనుల్లో పడిపోయాడు. ఇకపై ప్రమోషన్స్ లో అంచనాలు పెంచేలా మాట్లాడొద్దనీ .. సాధ్యమైనంత వరకూ స్టార్ డైరెక్టర్లతోనే చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి నెక్స్ట్ ప్రాజెక్టులు ఆయన ఎవరితో చేయనున్నాడనేది చూడాలి. 

  • Loading...

More Telugu News