Chasing: డిసెంబర్ 31న విడుదల కాబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ 'ఛేజింగ్' చిత్రం

 Varalakshmi Sarathkumar Chasing Telugu Movie release on 31st december
  • క్రాక్, నాంది, యశోద సినిమాలతో ఆకట్టుకున్న వరలక్ష్మి
  • సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా రంగ ప్రవేశం
  • ప్రతి నాయిక పాత్రలో ఆకట్టుకుంటున్న నటి

క్రాక్, నాంది, యశోద సినిమాలతో ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ విభిన్నమైన పాత్రలతో స్పెషల్ క్రేజ్ అందుకుంది. పాజిటివ్ రోల్స్ తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తూ తమిళ, తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. తన పాత్రలో వైవిధ్యత ఉండేలా చూసుకుంటూ స్టార్ నటిగా ఎదుగుతున్న వరలక్ష్మి నటిస్తున్న తాజా చిత్రం ‘ఛేజింగ్’.

మరో డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు కె.వీరకుమార్‌ దర్శకత్వం వహించగా, మదిలగన్‌ మునియాండి నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌ పతాకం పై ఏఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. తాషి సంగీతం సమకూర్చగా.. ఇ. కృష్ణస్వామి సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటికే తమిళంలో మంచి విజయం సాధించిన ఈ సినిమా ను తెలుగు లో డిసెంబర్ 31 వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

  • Loading...

More Telugu News