credit card: క్రెడిట్ కార్డ్‌ నుంచి డ్రా చేయడం లేదా కార్డుపై రుణం తీసుకోవడం.. ఏది బెటర్?

  • నగదు డ్రా చేస్తే వడ్డీ ఎక్కువ అంటున్న నిపుణులు
  • క్రెడిట్ కార్డుపై రుణం తీసుకోవడమే మేలని సూచన
  • రుణం పొందడమూ సులభమేనని వెల్లడి
Is Withdrawing money from a Credit Card or taking a loan on Credit card better

అత్యవసరమని క్రెడిట్ కార్డుతో నగదు డ్రా చేయడం కన్నా అదే కార్డుపై రుణం తీసుకోవడం మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ వడ్డీ (నగదు డ్రా చేయడంతో పోలిస్తే)తో మీ అవసరానికి నగదు వాడుకోవడానికి ఈ పద్ధతి ఉత్తమమని చెబుతున్నారు. క్రెడిట్ కార్డుతో నగదు డ్రా చేస్తే వడ్డీ ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని, అదే రుణం తీసుకుంటే తక్కువ వడ్డీతో పని పూర్తవుతుందని అంటున్నారు. పైగా ఇలా చేయడం వల్ల మీ సిబిల్ స్కోరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని పేర్కొన్నారు. నగదు డ్రా చేయడం, కార్డుపై రుణం తీసుకోవడం.. రెండింటితో లాభనష్టాలు ఇలా ఉంటాయట.. 

క్రెడిట్ కార్డుతో నగదు డ్రా చేయడం..
నగదు డ్రా చేయడం వల్ల మీ క్రెడిట్ పరిమితిపై ప్రభావం పడుతుంది. ఇలా డ్రా చేసిన సొమ్ముపై బ్యాంకులు 36 శాతం నుంచి 48 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. మిగిలిన మొత్తం చివరి చెల్లింపు రోజులోపు చెల్లించాలి. చెల్లింపులు సకాలంలో చేయకుంటే వడ్డీ పెరుగుతుంది.

క్రెడిట్ కార్డుపై రుణం తీసుకోవడం..
కార్డుపై రుణం తీసుకోవడం చాలా సులభం. కార్డు పొందేటపుడే అన్ని రకాల పత్రాలు బ్యాంకుకు అందజేస్తారు కాబట్టి వీటిపై రుణం తీసుకునేటపుడు కొత్తగా ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఇలా తీసుకున్న రుణాలను ఈఎంఐ కింద మార్చుకునే సదుపాయం ఉంటుంది. ఈ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటు 16 శాతం నుంచి 18 శాతం ఉంటుంది. మీ కార్డు పరిమితితో సంబంధం లేకుండా.. అంటే కార్డు పరిమితి తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మొత్తం నగదును రుణంగా పొందవచ్చు. అయితే, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే క్రెడిట్ కార్డుపై తీసుకునే రుణానికి వడ్డీ కాస్త ఎక్కువే ఉంటుంది.

More Telugu News