Madhya Pradesh: రెండు నెలలుగా చెప్పులు వేసుకోని మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి.. తొడుక్కునేలా చేసిన కేంద్ర మంత్రి

Jyotiraditya Scindia helps MP minister wear chappal he had abandoned as vow
  • గ్వాలియర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయిన ప్రద్యుమాన్ సింగ్
  • నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజల ఫిర్యాదు
  • బాగు చేసే దాకా పాదరక్షలు ధరించనని హామీ
  • రోడ్లు బాగవడంతో చెప్పులు వేసుకునేలా చేసిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య
కేంద్ర మంత్రి జ్యోతి రాదిత్య సింధియా.. మధ్యప్రదేశ్ ఇంధన మంత్రి, గ్వాలియర్ ఎమ్మెల్యే ప్రద్యుమాన్ సింగ్ తోమర్‌ను రెండు నెలల తర్వాత చెప్పులు ధరించేలా ఒప్పించారు. మంత్రి తన నియోజకవర్గంలో రోడ్లు మరమ్మతులు అయ్యే వరకు పాదరక్షలు ధరించనని ప్రమాణం చేశారు. అక్టోబరు 20న ప్రద్యుమాన్‌ సింగ్‌ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని గుర్తించారు. 

మరోపక్క, రోడ్ల దుస్థితిపై ప్రజలు కూడా మంత్రికి ఫిర్యాదు చేశారు. వాటిని బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. అప్పటిదాకా తాను చెప్పులు తొడుక్కోనని ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు మాట ఇచ్చినట్టుగానే ఆయన రోడ్లకు మరమ్మతులు చేయించారు. ఇందుకు నిధులు ఇచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్‌లకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం గ్వాలియర్‌ పర్యటనకు వచ్చిన జ్యోతిరాదిత్య.. సదరు మంత్రిని చెప్పులు ధరించేలా చేశారు.
Madhya Pradesh
Minister
chappals
Jyotiraditya Scindia
rodas repair

More Telugu News